- Advertisement -
ఒవైసీ ఫాతిమా కాలేజీ అక్రమ నిర్మాణాలపై క్లారిటీ ఇచ్చింది హైడ్రా. ఆ కాలేజీని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారు అని హైడ్రా అధికారులు తెలిపారు. FTLలో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్‌లో తొలగిస్తామన్నాం అన్నారు.
అయితే పేద ముస్లిం మహిళల విద్య కోసం ఆ సంస్థ నడుస్తోంది… ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు అన్నారు. అందులో 10 వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు అన్నారు.
పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నాం అని…అయితే ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం అని తేల్చిచెప్పారు అధికారులు.
Also Read:ఓటీటీలోకి ..’8 వసంతాలు’!
- Advertisement -

