రాజమౌళి ఈగ సినిమాకి తనదైన శైలిలో మాటలు రాసి ఆకట్టుకున్న జనార్ధన మహర్షి రచయితగా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు పని చేశారు. ఇప్పుడు జనార్ధన మహర్షి రాసిన నవలలు సంచనాలు సృష్టిస్తున్నాయి. పుస్తక పఠణం తగ్గిపోయిన ఈ కాలంలో కూడా జనార్ధన మహర్షి రాసిన వెన్నముద్దలు, చిదంబర రహస్యం వంటి నవలలు అత్యంత ఆదరణ పొందాయి. అలాగే ఆయన రాసిన పంచామృతాలు కూడా బాగా ఆకట్టుకుంది.
అలాగే ఆయన రాసిన కవిగానే కన్నుమూస్తా అనే కవితా సంకలనం తెలుగు కవితా ప్రపంచాన్ని కదిలించింది. అదేవిధంగా మధుర సంభాషణలు అనే సంభాషణా సంకలనాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో 190 కి పైగా సంభాషణలు మనల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి, ప్రశ్నిస్తాయి, పరామర్శిస్తాయి. కళాతపస్వి కె. విశ్వనాధ్ గారు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి నటించిన దేవస్థానం అనే చిత్రానికి రచయతగా, నిర్మాతగా, దర్శకుడిగా జనార్ధన మహర్షి విమర్శకుల ప్రశంసలు పొందారు.
అన్నట్టు జనార్ధన మహర్షి నుంచి ఇటీవలే వచ్చిన జన పదాలు ఒక నవ్య నూతన ప్రయోగం. రచయిత తాలూకు విన్నూతమైన ఆలోచనా ధోరణి మరియు రచన శైలిని మనకి పరిచయం అవుతుంది. జనార్ధన మహర్షి ఇప్పుడు పుస్తక రచయితగా రాబోయే తరాలకు గొప్ప సాహిత్యాన్ని అందించడానికి పూనుకున్నారు.
ఇవి కూడా చదవండి..