‘జనధ్వని’తో వస్తున్న జేడీ..!

260
jd laxminarayana
- Advertisement -

అవినీతి పరుల గుండెల్లో గుబులు పుట్టించిన సీబీఐ మాజీ డైరెక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణ. ముంబై అడిషనల్ డీజీపీగా పనిచేస్తునే తన పదవికి రాజీనామా చేసిన జేడీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన తొలుత ఏ పార్టీలో చేరుతారో అన్న సందిగ్దం అందరిలో నెలకొంది. అయితే ఆ సందేహాలకు చెక్ పెడుతూ సొంతపార్టీ ఏర్పాటుచేస్తానని ప్రకటించారు.

ఈ నెల 26న పార్టీ పేరు ప్రకటిస్తారని ఆయనే స్వయంగా ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ పేరేంటో అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.జేడీగా సుప్రసిద్ధుడైన ఆయన తన పార్టీ పేరు కూడా… అలాగే స్ఫురించేలా జన ధ్వని(జేడీ) అని పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ జేడీ పేరు పైనే లక్ష్మీనారాయణ ఆసక్తి చూపుతున్నట్లు భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌ వేదిక పార్టీ పేరు ప్రకటించనుండగా కొంతమందికి మాత్రమే ఆహ్వానాలు పంపారు.

తెలుగు వ్యక్తి అయిన లక్ష్మీనారాయణ ఐపీఎస్ ఆఫీసర్‌గా పలు కీలక బాధ్యతలు చేపట్టారు. సత్యం కుంభకోణం ,జగన్ అక్రమాస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు కీలక కేసులను ఎలాంటి రాజకీయాలకు తలొగ్గకుండా పరుగులు పెట్టించారు.

- Advertisement -