జమ్మూ కశ్మీర్..తొలి విడత పోలింగ్ అప్‌డేట్

4
- Advertisement -

పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇవాళ ఉదయం 7 గంటలకు తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా 23 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

జమ్మూలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతలో 24 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు.

పోలింగ్ నేపథ్యంలో కేంద్ర సాయుధ పారామిలిటరీ దళాలు (సిఎపిఎఫ్) జమ్మూ కాశ్మీర్ సాయుధ పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

మొదటి దశలో కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ అభ్యర్థులు పిడిపి అభ్యర్థి ఇల్తిజా ముఫ్తీ, సిపిఐ (ఎం) అభ్యర్థి మహ్మద్ యూసుఫ్ తరిగామి, కాంగ్రెస్ అభ్యర్థి గులాం అహ్మద్ మీర్ ఉన్నారు. మాజీ మంత్రులు సజ్జద్ కిచ్లూ (ఎన్సీ), వికార్ రసూల్ వానీ (కాంగ్రెస్) తో పాటు సునీల్ శర్మ (బీజేపీ), గులాం మహ్మద్ సరూరి (ఇండిపెండెంట్) తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకుంటున్నారు. 35,000 మందికి పైగా కాశ్మీరీ పండితులు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.

Also Read:ప్రధాని మోడీ బర్త్ డే..ఒకే చోట 74 మొక్కలు

- Advertisement -