హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు జై…

125
trs

హుజురాబాద్ లో కారు జోరు మీదుంది. త్వరలో ఉప ఎన్నికలు జరగనుండగా ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు కుల సంఘాలు, పలు యానియన్లు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నాయి. జమ్మికుంట పూసల సంఘం ఇప్పటికే గెల్లు అభ్యర్థిత్వాన్నిఆమోదించగా, జమ్మికుంట ఆటో యూనియన్ ఏకగ్రీవంగా శ్రీనివాస్ యాదవ్ కు ఓటేస్తామని తీర్మానం చేసింది.

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు తమ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని జమ్మికుంట పూసల సంఘం అధ్యక్షులు ముద్రకోలా రమేష్ అన్నారు. ఉపఎన్నికలో భారీ మెజార్టీ తో టీఆర్ ఎస్ ను గెలిపిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పూసల సంఘం ఉపాధ్యక్షుడు నాగిశెట్టి కిరణ్, ప్రధాన కార్యదర్శి నాగిశెట్టి కనకయ్య టీఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గోగికర్ సుధాకర్ వెంకన్న, రఘుపతి, సతీష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.