- Advertisement -
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 600 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి ఫాస్ట్ బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. పాకిస్ధాన్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 5 ,రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టి 600 వికెట్ల మైలురాయిని దాటారు.
2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో టెస్టు ఆరంగేట్రం చేసిన అండర్సన్ ఇప్పటివరకు 156 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 29 సార్లు 5 వికెట్లు తీయగా 10 సార్లు 10 వికెట్లను తీశాడు.
అండర్సన్ కంటే ముందు మురళీధరన్ 800 , షేన్ వార్న్ (708), అనిల్ కుంబ్లే (619) ముందున్నారు. వీరు ముగ్గురు స్పిన్నర్లు కావడం విశేషం.
- Advertisement -