మొక్కలు నాటిన కోరుట్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్..

1259
korutla

హరిత తెలంగాణ సాధనకోసం, పర్యావరణ పరిరక్షణ పై ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఎంపీ జోగినపెల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య-అనిల్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి వార్డులో మొక్కలను నాటారు కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్.

ఈ సందర్భంగా గడ్డమీది పవన్ మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి సూచనల మేరకు హరితహారం కార్యక్రమం విజయవంతంగా సాగిందని తెలిపారు.. అలాగే హరితహారంలో నాటిన ప్రతి మొక్క కాపాడే బాధ్యత మనమే తీసుకోవాలని కోరారు.

అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు శ్రీ అన్నం అనీల్, పట్టణ ప్రధానకార్యదర్శి శ్రీ గుడ్ల మనోహర్, కోరుట్ల PACS చైర్మన్ శ్రీ ఎలిశెట్టి భూమరెడ్డి, జిల్లా గ్రంథాలయ కమిటీ సభ్యులు పుప్పాల ఉమాదేవి – ప్రభాకర్ కు తలా మూడు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరినట్లు పవన్ తెలిపారు.