దేశంలో 33 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

160
corona

దేశంలో కరనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. రోజుకు 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో 67,151 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 1059 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య 60 వేలకు చేరువయ్యాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 32,34,475కు చేరగా 24,67,759 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 7,07,267 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 59,449 మంది మృతిచెందారు.

ఇప్పటివరకు 3,76,51,512 కరోనా టెస్టులు చేయగా నిన్న ఒక్క‌రోజే 8,23,992 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని ఐసీఎంఆర్ వెల్లడించింది.