గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా వంటి వైవిధ్యమైన సినిమాలతో హీరోగా మారిన హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి. తాజాగా జంబలకిడి పంబ అంటూ ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు ముందుకువస్తున్నాడు. 1993లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకిడి పంబ ఎంతగా నవ్వించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తాజాగా అలాంటి కితకితలు పెట్టేందుకు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా . జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్నారు.
హైదరాబాద్, ఈస్ట్ గోదావరి, అరకు, వైజాగ్, కేరళ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో శ్రీనివాస రెడ్డి అమ్మాయిలా లిప్‌స్టిక్ పెట్టుకుంటుంటే, హీరోయిన్ సిద్ధి ఇద్నానీ మగాడిలా ఫోజిచ్చింది. ఈ పోస్టర్ అభిమానులని అలరిస్తుంది.
పోసాని,వెన్నెలకిశోర్ పాత్రలు ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని చిత్రయూనిట్ చెబుతోంది. కూడా హైలైట్ గా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించే సినిమా అవుతుంది“ అని చెప్పారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.