ప్రియాంక హాలీవుడ్ మూవీ ట్రైలర్..

208
A Kid Like Jake trailer
- Advertisement -

బాలీవుడ్‌లో అడుగు పెట్టి తన నటనతో అదరగొట్టిన హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇక బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా తన నటనతో అదరహో అనిపిస్తుంది. క్వాంటికో అనే అమెరిక‌న్ టీవీ సిరీస్‌తో అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొంది హాలీవుడ్‌లో సైతం దూసుకుపోతోంది. తొలిసారి బేవాచ్ అనే హాలీవుడ్ చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక.

A Kid Like Jake trailer

ఇక ప్రస్తుతం సిలాస్ హోవార్డ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎ కిడ్ లైక్ జాక్ అనే చిత్రంలో అమల అనే పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లో మూడు సెకన్లు మాత్రమే కనిపించింది ప్రియాంక. ఈ చిత్రాన్ని సన్ డ్యాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైనట్లు సమాచారం. ఈ సినిమా నాలుగు ఏళ్ళ చిన్నారి జాక్ చుట్టూ సాగనున్నట్లు సమాచారం. దీని త‌ర్వాత స‌ల్మాన్ స‌ర‌స‌న భ‌ర‌త్ అనే చిత్రంలోను న‌టించ‌నున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -