IND vs ENG : జయహో జైస్వాల్ !

30
- Advertisement -

టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇతర ఆటగాళ్ల సాధ్యం కానీ రీతిలో అలవోకగా రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇంగ్లాండ్ మరియు భారత్ మద్య జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో జైస్వాల్ అద్బుత ఫామ్ కొనసాగుతూనే ఉంది. మొదటి టెస్ట్ లో ఆఫ్ సెంచరీతో రాణించిన జైస్వాల్, రెండో టెస్ట్ లో డబుల్ సెంచరీ బాది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

 తాజాగా రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో కూడా అద్బుత ఇన్నింగ్స్ తో డబుల్ సెంచరీ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. ఇతర ఆటగాళ్లు తడబడుతున్నప్పటికి.. అలవోకగా పరుగులు రాబడుతు మంచినీళ్లు తాగినంత ఈజీగా డబుల్ సెంచరీలు సాధిస్తున్నాడు జైస్వాల్. జైస్వాల్ ( 214 ), గిల్ ( 91 ), సర్ఫరాజ్ ఖాన్ ( 67 ) పరుగులు చేసి భారీ స్కోరు కు బాటలు వేయడంతో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 430 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దాంతో భారత్ 556 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.

జైస్వాల్ రికార్డులు
యువ సంచలనం జైస్వాల్ వరుస డబుల్ సెంచరీలతో పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు టెస్టులలో టీమిండియా తరుపున వరుస డబుల్ సెంచరీలు చేసిన వారిగా వినోద్ కాంబ్లే, విరాట్ కోహ్లీ ఉన్నారు. వారి తరువాత చిన్న వయసులో తక్కువ ఇన్నింగ్స్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించిన ప్లేయర్ గా యశస్వి నిలిచాడు. ఇక ఒక సిరీస్ లో అత్యధిక సిక్సులు బాదిన ప్లేయర్ గా కూడా జైస్వాల్ నిలిచాడు. ఈ సిరీస్ లో జైస్వాల్ ఇప్పటివరకు 20 సిక్సులు నమోదు చేశాడు. ఆ తర్వాత ఒకే సిరీస్ లో అత్యధిక సిక్సులు నమోదు చేసిన ఆటగాళ్ల స్థానాల్లో రోహిత్ శర్మ ( 19 ), హర్బజన్ సింగ్ ( 14 ), సిద్దు ( 11 ) ఉన్నారు. మరి ఫ్యూచర్ ఆశాకిరణంలా మారుతున్న జైస్వాల్ మున్ముందు ఇంకెలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

- Advertisement -