భారత విదేశీ వ్యవహారాల మంత్రి (EAM) డాక్టర్ ఎస్. జైశంకర్ తన అధికారిక పర్యటనలో భాగంగా వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ బ్రియన్ లారాను కలిశారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ఉన్న ఆయన, ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన లారాతో కొద్దిసేపు ముచ్చటించారు.
భారత్ మరియు కరీబియన్ దేశాల మధ్య క్రికెట్‌కు ఉన్న విడదీయలేని బంధాన్ని ఈ భేటీ ప్రతిబింబించింది. భారత్‌లో లారాకు ఉన్న విపరీతమైన ఆదరణ గురించి మరియు క్రికెట్ పట్ల ఉన్న మక్కువ గురించి ఇరువురు చర్చించుకున్నారు.ఈ భేటీ అనంతరం జైశంకర్ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంటూ.. క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారాను కలవడం చాలా సంతోషంగా ఉంది. క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న అనుభవం మరియు భారత్‌తో ఆయనకున్న అనుబంధం గురించి చర్చించడం అద్భుతంగా అనిపించింది అని పేర్కొన్నారు.
క్రికెట్ ప్రపంచంలో లారా సాధించిన రికార్డులను, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో ఆయన చేసిన 400 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మంత్రి జైశంకర్ ప్రస్తుతం కరీబియన్ దేశాల పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ఇంధన రంగం మరియు వాణిజ్యంలో సహకారంపై ఆ దేశ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. అయితే, ఈ బిజీ షెడ్యూల్ మధ్య లారాతో భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Also Read:దేశ ఆత్మగౌరవానికి నిదర్శనం..సోమనాథ్ ఆలయం

