బండికి సన్‌స్ట్రోక్…కొడుకుపై పోక్సో కేసు

14
- Advertisement -

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు షాక్ తగిలింది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో (POCSO) కేసు నమోదైంది.

17 ఏళ్ల మైనర్ బాలికను ట్రాప్ చేసి, మద్యం తాగించి, లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలి తల్లి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.నిందితుడి వేధింపుల కారణంగా బాలిక తీవ్ర మానసిక కుంగుబాటుకు లోనై, రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ విషయం బయటకు రాకుండా రాజీ పడాలని బాధితురాలి కుటుంబాన్ని బెదిరించినట్లు, వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితురాలు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే, కరీంనగర్‌లో సాయి భగీరథ్ ఆ బాలికపై ‘హనీట్రాప్’ ఆరోపణలతో ఎదురు కేసు పెట్టారు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు పేట్ బషీరాబాద్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు ఐదారు గంటల పాటు జాప్యం చేశారని, చివరకు ఒత్తిడి పెరగడంతో అర్ధరాత్రి పోక్సో కేసు నమోదు చేశారని కథనం వివరించింది.

తమకు న్యాయం జరగకపోతే ప్రధాని మోదీ సభలో ఆత్మార్పణ చేసుకుంటామని బాధిత కుటుంబం హెచ్చరించింది. కేంద్రమంత్రి హోదాలో ఉండి బాధితులకు అండగా ఉండాల్సింది పోయి, తన కుమారుడిని కాపాడుకోవడానికి అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారని బండి సంజయ్‌పై పత్రిక విమర్శలు గుప్పించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

- Advertisement -