జైలర్ 2తో రజనీ సరికొత్త రికార్డు!

2
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ తమిళ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల వసూళ్ల మార్కును అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆయన మాట్లాడుతూ.. తమిళ సినిమా 120 ఏళ్ల చరిత్రలోనే ‘జైలర్ 2’ నంబర్ వన్ చిత్రంగా నిలిచిందని పేర్కొన్నారు. విడుదలైన తొలి ఆరు రోజుల్లోనే ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించిందని తెలిపారు. సినిమా విడుదలైన మొదటి రోజు సాధారణంగానే అడ్వాన్స్ బుకింగ్స్ నమోదైనా, ఫ్యాన్స్ షో తర్వాత మధ్యాహ్నం ప్రదర్శనల నుంచి థియేటర్లన్నీ ప్రేక్షకులతో నిండిపోయాయని చెప్పారు.

అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమా 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.710.35 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో రజనీకాంత్ నటించిన ‘2.0’ సినిమా వసూళ్లను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. ఇందులో భారతదేశంలో రూ.466.85 కోట్లు, విదేశాల్లో రూ.243.50 కోట్ల వసూళ్లు వచ్చాయి.

మరోవైపు సినిమా థియేటర్లలో మరికొంతకాలం కొనసాగితే వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో నాలుగు వారాల ఓటీటీ విడుదల గడువును వాయిదా వేయాలని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌ను కోరినట్లు వెల్లడించారు.

Also Read:సోనియా గాంధీకి CTI లేఖ

- Advertisement -