ట్రంప్‌కు డమ్మీ అభ్యర్థి టెన్షన్!

3
- Advertisement -

2014 లోక్‌సభ ఎన్నికల్లో మథుర నియోజకవర్గంలో హేమమాలినిపై పోటీకి మరో హేమమాలిని కూడా బరిలోకి దిగిన విషయం చాలామంది భారతీయులకు గుర్తుండకపోవచ్చు. అలాగే 2019లో వయనాడ్‌లో రాహుల్ గాంధీతో పాటు మరో రాహుల్ గాంధీ, రఘుల్ గాంధీ పేర్లతోనూ అభ్యర్థులు పోటీ చేశారు.

భారత ఎన్నికల రాజకీయాల్లో ఇలాంటి డమ్మీ అభ్యర్థులు కొత్తేమీ కాదు. కొన్నిసార్లు హోరాహోరీగా సాగే ఎన్నికల పోరులో ఇవి కాస్త హాస్యాన్ని కూడా పంచుతుంటాయి. అయితే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాలోని మారుమూల ప్రాంతమైన అలాస్కాలోనూ ఇలాంటి డమ్మీ అభ్యర్థి వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది.

Also Read:రాహుల్ వల్లే మోదీ గెలుపు!

అమెరికాలో త్వరలో జరగనున్న కీలక మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ వివాదం తెరపైకి వచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు, ప్రజాదరణకు ఈ ఎన్నికలు ఒకరకంగా రెఫరెండంలా మారనున్నాయి. ఈ నేపథ్యంలో అలాస్కాలో వెలుగుచూసిన డమ్మీ అభ్యర్థి వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

డెమోక్రాట్లకు చెందిన రాజకీయ వ్యూహకర్తలు పన్నిన కుట్రగా ఈ వివాదాన్ని భావిస్తున్న ట్రంప్.. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -