జై ‘లవ’కుశ టీజర్ వచ్చేస్తోంది…!

202
Jai Lava Kusa teaser on 25th aug
- Advertisement -

జూనియ‌ర్ ఎన్టీఆర్, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం జై ల‌వకుశ‌.  ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండగా సినిమా సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. రావణుడు వచ్చాడు అంటూ విడుదల చేసిన  టీజర్‌తో ఎన్టీఆర్‌ సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేశాడు. ఇందులో ఎన్టీఆర్ మెస్మ‌రైజింగ్ లుక్ తో   ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళాడు.

ఇటీవలే ఈ సినిమా నుంచి ‘లవ’ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. లవర్ బాయ్‌గా కనిపించిన లవ ఫస్ట్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక వినాయక చవితి కానుకగా లవ టీజర్‌ని విడుదల చేయనుంది చిత్రయూనిట్. మొదటి టీజర్ కి మించి రెండవ టీజర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

లవ టీజర్ విడుదల చేసిన తర్వాత  పెద్ద గ్యాప్ లేకుండానే ‘కుశ’ పాత్రకి సంబంధించిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ‘లవ’ టీజర్ తో .. ‘కుశ’ ఫస్టులుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడం ఖాయమన్న మాట. ఎన్టీఆర్ సరసన రాశిఖన్నా, నివేదా థామస్, నందితా రాజ్ కథానాయికలుగా నటిస్తోన్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో స్వయంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -