రెమ్యూనరేషన్‌ దెబ్బకి దిమ్మతిరగాల్సిందే..

340
- Advertisement -

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ‘సాహో’ సౌండే వినిపిస్తోంది. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మొన్నటివరకూ హీరోయిన్‌ దొరకలేదు. కానీ రీసెంట్ గా బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్ కే చిత్రటీమ్‌ ఫిక్సైపోయింది.

ఇదంతా బాగానే ఉన్నా..రెమ్యూనరేషన్‌ విషయలో మళ్ళీ హాట్‌ టాపిక్‌ గా మారింది సాహో. ఇందులో నుండి హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్‌లకు రెమ్యూనరేషన్ భారీగా అందుతున్నట్లు సమాచారం.

 prabhas and sharddha getting high remunaration in saho

ఓ ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్ కథనం ప్రకారం… ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ రూ. 12 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. శ్రద్ధా కపూర్ రేంజికి ఇది చాలా పెద్ద మొత్తమే. అయితే ఆమె అలా డిమాండ్ చేయడానికి ఓ కారణం ఉంది. ఈ సినిమా మూడు భాషల్లో తెరకెక్కుతోంది.

డేట్స్ కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణ సినిమాతో పోలిస్తే ఈ చిత్రానికి రెట్టింపు శ్రమ పడాల్సి ఉంటుంది. అందుకే రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేసిందట.

prabhas and sharddha getting high remunaration in saho

ఇక బేరసారాల అనంతరం శ్రద్ధా కపూర్ 9 కోట్ల రెమ్యూనరేషన్‌కు ఒప్పుకుందని….. చాలా కాలం క్రితమే శ్రద్ధా కపూర్ పేరు బయటకు వచ్చినా, బేరసారాల కారణంగానే అఫీషియల్ ప్రకటన రావడం లేటయిందని టాక్. ఇదిలా ఉంటే..ప్రభాస్ అందరికంటే భారీ మొత్తం అందుకుంటున్నాడు.

ఆయన రెమ్యూనరేషన్‌గా రూ. 30 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. సినిమా నడిచేది ప్రభాస్ స్టార్ ఇమేజ్ మీదనే కాబట్టి ఆ మాత్రం ఇవ్వడం సబబే అనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి సోహోలో రెమ్యూనరేషన్‌ సౌండ్‌ మాత్రం బాగానే మోగుతోంది.

- Advertisement -