ట్రైలర్ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌..

217
- Advertisement -

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ గా, బాధ్యతగల యువ విద్యార్ధిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం “ఒక్కడు మిగిలాడు”.

అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్-న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకాలపై ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 okkadu migiladu movie trailer release on 19th august

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్టర్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ కి .. ఈ నెల 19వ తేదీ ఉదయం 8 గంటల 45 నిమిషాలను ముహూర్తంగా నిర్ణయించారు.

మనోజ్ సరసన అనీషా ఆంబ్రోస్ కథానాయికగా నటించింది. ఈ సినిమా సక్సెస్ పైనే మనోజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

- Advertisement -