దుమ్మురేపుతున్న…. ‘జై లవకుశ’

228
Jai Lava Kusa Teaser: NTR Impressed Rajamouli
- Advertisement -

జూనియ‌ర్ ఎన్టీఆర్, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం జై ల‌వకుశ‌. ఇందులో ఎన్టీఆర్.. జై, ల‌వ‌, కుశ అనే మూడు విభిన్న పాత్ర‌ల‌లో కనిపించ‌నున్న‌ట్టు టాక్ . సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానున్న ఈ చిత్ర టీజ‌ర్ తాజాగా విడుద‌ల చేశారు. ఇది జై అనే పాత్ర‌కి సంబంధించిన టీజ‌ర్ కాగా, ఇందులో ఎన్టీఆర్ మెస్మ‌రైజింగ్ లుక్ తో క‌నిపించి ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళాడు.

‘ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాలా… ఈ రావణుణ్ని సంపాలంటే సముద్రమంత ధైర్యం ఉండాలా…! ఉందా?’ అంటున్న ఎన్టీఆర్‌ డైలాగ్‌తో ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు ఫిదా అవుతున్నారు. ఇప్పటివరకు 37 లక్షల వ్యూస్‌, లక్షా 74 వేల లైక్‌లతో యూ ట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. ఇందులో ఎన్టీఆర్ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో జై పాత్రకు సంబంధించిన టీజర్‌ గురువారం విడుదలైంది.

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి.. ఎన్టీఆర్ కొత్త సినిమా టీజ‌ర్‌పై స్పందిస్తూ… అంద‌రితో ‘వావ్’ అనిపించేలా చేస్తూ తారక్ ఎంతో అద్భుతంగా ప‌బ్లిసిటీ ప్రారంభించాడని పేర్కొన్నారు. ‘జై ల‌వ కుశ’ టీజ‌ర్‌పై స్పందించిన మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌… ‘జై ల‌వ‌కుశ సినిమాలోని జైని ‘జ‌వాన్’ సినిమాలోని జై ఆహ్వానిస్తున్నాడు’ అని పేర్కొన్నాడు.

సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్.. జై వ‌చ్చేశాడ‌ని, జై స్టైల్, డైలాగ్స్‌ అంద‌రికీ న‌చ్చుతాయ‌ని పేర్కొన్నాడు.హీరోయిన్ నివేద థామ‌స్ ‘జై అంద‌రి కోసం’ అంటూ ట్వీట్ చేసింది. ఇక ఫ్యాన్స్‌ అయితే ‘కుమ్మేశావ్ అన్నా.. అదిరిపోయింది.. ద‌టీజ్ ఎన్టీఆర్’ అంటూ కామెంట్లు పెడుతూ పండుగ చేసుకుంటున్నారు.

- Advertisement -