జనతా గ్యారేజ్‌ని బ్రేక్‌ చేసిన ‘జై లవ కుశ’..

238
- Advertisement -

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ చిత్రం బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రముఖుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా ఈ చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్‌ రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. యూఎస్‌ఏ బాక్సాఫీసు వద్ద 18వ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. బుధవారం 168 లొకేషన్లలో ప్రదర్శించిన (ప్రీమియర్‌ షోలు) ఈ చిత్రం 560,699 డాలర్లు (రూ. 3.64 కోట్లు) రాబట్టినట్లు ట్వీట్‌ చేశారు.

Jai Lava Kusa First Day Box Office Collection

ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.24 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. వారాంతానికి చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌కు చేరువయ్యే అవకాశాలు ఉన్నట్లు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 134 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం వసూళ్లను ‘జై లవకుశ’ అధిగమించి, ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌లో కొత్త రికార్డును సృష్టించేలా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

Jai Lava Kusa First Day Box Office Collection

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆడియన్స్ ను ఆకట్టుకోవడం రాశిఖన్నా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఇలా ఈ సినిమాకి అన్నీ కలిసొచ్చాయని అంటున్నారు. బాబీ ‘జై లవకుశ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. నివేదా థామస్‌, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మించారు.

- Advertisement -