టాస్‌ గెలిచిన డేవిడ్‌ వార్నర్‌..

86
SRH

ఐపీఎల్ టోర్నీలో 52వ మ్యాచ్ జరుగుతోంది.. శనివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన హైదరాబాద్‌ అదే జోరులో బెంగళూరుపై కూడా నెగ్గి పాయింట్ల పట్టికలో ముందంజ వేయాలని భావిస్తోంది.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 15 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఆర్సీబీ 7 సార్లు విజయం సాధించగా.. మరో 8 మ్యాచ్‌లో గెలిచింది. ఈ టోర్నీలో ఇంతకు ముందు ఓసారి ఇరు జట్లు మ్యాచ్ ఆడాయి. సెప్టెంబరు 21న జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది. 10 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది.

సన్‌రైజర్స్‌ ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయం కారణంగా తప్పుకున్న విజయ్ శంకర్ స్థానంలో వృద్దిమాన్ సాహా జట్లులోకి వచ్చాడు. ఇక బెంగళూరులో రెండు మార్పులు చేశారు. శివం దుబే స్థానంలో నవదీప్ శైని, స్టెయిన్ స్థానంలో ఇసురు ఉదానాను జట్టులోకి తీసుకున్నారు.