టీపీసీసీ చీఫ్ ‘ పదవి ఎవరికో మరి?

53
- Advertisement -

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తరుపున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నిక కావడంతో ఇక ముందు రోజుల్లో పార్టీని నడిపించే టీపీసీసీ చీఫ్ పదవిలో ఎవరుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి అలాగే పీసీసీ పదవికి వేరువేరు సభ్యులను ఎంపిక చేస్తూ ఉంటుంది అధిష్టానం. కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి టీపీసీసీ పదవిలో ఉన్న రేవంత్ రెడ్డే ముఖ్య కారణం. ప్రస్తుతం ఆయనకు ముఖ్యమంత్రి పదవి అప్పగించడంతో టీపీసీసీ పదవి విషయంలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. రేవంత్ రెడ్డిని టీపీసీసీ పదవి నుంచి తప్పిస్తారా ? లేదా ఆయననే కొనసాగిస్తారా ? ఒకవేళ రేవంత్ రెడ్డిని తప్పిస్తే ఆ పదవిలో ఎవరిని ఎంపిక చేయబోతున్నారనే ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. .

ప్రస్తుత పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా కంటిన్యూ చేసే అవకాశాలు తక్కువే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పదవి కోసం కొంతమంది సీనియర్ నేతలు గట్టిగానే పోటీ పడుతున్నారు. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు మొదటి నుంచి టీపీసీసీ పదవిపై ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి బీసీ నేతకు ఆ బాద్యత అప్పగించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీసీ నేతల విషయానికొస్తే మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్.. వంటి వారు అధ్యక్ష రేస్ లో ఉండే అవకాశం ఉంది. అయితే రేవంత్ రెడ్డి సలహా సూచనల మేరకే టీపీసీసీ చీఫ్ పదవిపై అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. మరి టీపీసీసీ చీఫ్ పదవిపై నెలకొన్న సస్పెన్స్ తొలగిపోవాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:అడివి శేష్ ‘G2’ అప్‌డేట్

- Advertisement -