కాంగ్రెస్‌తో.. బాబు పవన్ పొత్తు?

42
- Advertisement -

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టం. బద్ద శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులుగాను, మిత్రుత్వం ఉన్నవారు శత్రుత్వం పెంచుకోవడం వంటి సంఘటనలు చూస్తూ ఉంటాము. ఇకపోతే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడ్డ టీడీపీ చివరికి అదే కాంగ్రెస్ తో చేతులు కలుపుతుందని ఎవరైనా ఊహించారా ? ఆ పరిణామం 2018 తెలంగాణ ఎన్నికల ముందు చోటు చేసుకుంది. ఇక అప్పటి నుంచి టీడీపీ కాంగ్రెస్ మద్య అరకొర ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉందనే చర్చ జరుగుతోంది. ఇక ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీడీపీ క్యాడర్ లో కూడా సంబరాలు అంభారాన్ని అంటిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఏపీలో కూడా టీడీపీ కాంగ్రెస్ దోస్తీ కొనసాగేలా అడుగులు పడుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీ.. కాంగ్రెస్ కు కూడా కలుపుకుంటే మరింత బలం చేకూరుతుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడట. ఇదిలా ఉంచితే అమరావతి రాజధానిగా కొనసాగాలని ఈ నెల 17న భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కల్యాణ్ ఇద్దరు హాజరవుతున్నారు. అయితే ఏపీ జేఏసీ సభ్యులు కాంగ్రెస్ ఆగ్ర నేత ప్రియాంక గాంధీకు కూడా ఆహ్వానం పలకబోతునట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రియాంకా గాంధీ ఈ సభకు హజరైతే చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రియాంక గాంధీ ఒకే వేధికపై కనిపించే అవకాశం ఉంది. అదేగనుక జరిగితే మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం. అయితే పవన్ టీడీపీతో పాటు ఆల్రెడీ బీజేపీతో కూడా పొత్తులో ఉన్నారు. అయితే బీజేపీలో ఆయన దోస్తీ నామమాత్రమే అనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అందువల్ల వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఉన్న టీడీపీ జనసేన పార్టీలు కాంగ్రెస్ తో చేతులు కలిపిన ఆశ్చర్యం లేదనేది కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట.

Also Read:జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా?

- Advertisement -