పొలిటికల్ ఎంట్రీపై జగపతిబాబు ఆసక్తికర కామెంట్స్!

41
Jagapathi babu
- Advertisement -

పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు హీరో జగపతిబాబు. ఆయన నటించిన పరంపర సీజన్ 2 సిరీస్‌ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమానే ఒక మాయ. పాలిటిక్స్ ఒక మాయాలోకం. ఆ మాయాలోకం అర్థం చేసుకోవడం నావల్ల కాదు. నాకంత బుర్ర లేదు అన్నారు.

రాజకీయాల గురించి నేను అసలు ఆలోచించాను. నాకు నలుగురితో మాట్లాడే తెలివే లేదు. అలాంటిది రాజకీయాల్లో జాయిన్‌ అయి వాళ్లతో ముందుకెళ్లడం చాలా కష్టం అన్నారు. నాలాంటోడు రాజకీయాలకు పనికిరాడు…. పాలిటిక్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, కలుస్తూ ఉంటాం, అంతేగాని రాజకీయాల్లోకి ఎంట్రీ మాత్రం ఇవ్వను అని తేల్చిచెప్పారు. రాజకీయాల గురించి నాకున్న అవగాహన సున్నా కాబట్టి పాలిటిక్స్‌లో నా ఎంట్రీ, లేదా నేను పార్టీ పెట్టడం అనేది జరగని అన్నారు.

- Advertisement -