‘గని’.. జగపతిబాబు లుక్‌ అదిరింది..

88
Jagapathi Babu
- Advertisement -

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గని’. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, ఈ నెల 15వ తేదీన టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 3వ తేదీన సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని కీలక పాత్రలను పరిచయం చేస్తూ.. సినిమాలోని వారి లుక్‌ను రోజుకొకటి చొప్పున విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో నదియా పోషించిన ‘మాధురి’ పాత్రను పరిచయం చేస్తూ నిన్న ఆమె లుక్ ను వదిలారు. ఇక జగపతిబాబు పోషించిన ఈశ్వర్ నాథ్ పాత్రను పరిచయం చేస్తూ, ఈ రోజున ఆయన లుక్ ను రిలీజ్ చేశారు. ఆయన లుక్ డీసెంట్ గా ఉంది. ఇక తెరపై ఆ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. వరుణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి సయీ మంజ్రేకర్‌ నటిస్తున్నారు.

- Advertisement -