- Advertisement -
ఏపీలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను నడిపిస్తుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే అని ఆరోపించారు ఏపీ సీఎం జగన్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జగన్…కడప లోక్‌సభ స్థానంలో తన చెల్లెలు పోటీ చేయడంపై తనకు ఎటువంటి బాధ లేదని అన్నారు.
షర్మిలను నడిపిస్తుంది టీడీపీ చంద్రబాబు అని… ఏపీలో కాంగ్రెస్, బీజేపీ రిమోట్‌లు చంద్రబాబు వద్దే ఉన్నాయని తెలిపారు. ఇక కడప నుండి పోటీ చేస్తున్న షర్మిల డిపాజిట్ దక్కించుకోదన్న బాధే ఎక్కువగా ఉందని చెప్పారు.
నపై నమోదైన అక్రమ ఆస్తుల కేసులో తన తండ్రి పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీ పక్షాన షర్మిల పనిచేయడం తనకు ఆవేదనగా ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబుతోనే కాకుండా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో కూడా తాను పోరాటం చేస్తున్నానని వెల్లడించారు.
Also Read:Revanth:ఎవరికి భయపడం
- Advertisement -