జగన్నాటకం.. దేనికోసం!

18
- Advertisement -

అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు.. అది కుదరకపోవడంతో విశాఖ రాజధాని అది కూడా నెరవేరకపోవడంతో అమరావతినే రాజధాని అన్నారు.. ఇప్పుడేమో కొత్తగా హైదరబాద్ ను రాజధానిగా కోరుకుంటున్నారు.. ప్రస్తుతం రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ నేతల తీరు ఇది. దీంతో అసలు రాజధాని విషయంలో జగన్ సర్కార్ ఏం ఆలోచిస్తోంది ? ఎందుకు చర్చకు తీసుకొస్తుంది ? అనేది ఎవరికి అర్థం కానీ పరిస్థితిగా మారిపోయింది. డిసెంబర్ నాటికి విశాఖ నుంచి పాలన సాగుతుందని స్వయంగా సి‌ఎం జగన్మోహన్ రెడ్డినే చెప్పుకొచ్చారు. కానీ జరగలేదు. ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజధాని అంశం చర్చనీయాంశం అవుతుండడంతో ప్రస్తుతానికి అమరావతినే రాజధాని అని మంత్రి అంబటి రాంబాబు ఆ మద్య చెప్పుకొచ్చారు. .

ఇంతలోనే మళ్ళీ ఏమైందో తెలియదు గాని ఒక అడుగు ముందుకెస్తూ హైదరబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి ఇటీవల వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దాంతో క్యాపిటల్ విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదా అంటూ స్వయంగా ప్రజలే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే రాజధాని విషయంలో జగన్ సర్కార్ ఎందుకు ఇన్ని మలుపులు తిరుగుతొందనే దానిపై ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం అంచనా వేయలేకపోతున్నారు.

అయితే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పదేళ్ళు కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం తీర్మానించింది. ఇక ఈ ఏడాది జూన్ తో పదేళ్ళు పూర్తవుతుండగా ఏపీకి కచ్చితంగా రాజధానిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రాజధాని విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తుండడంతో కొత్తగా హైదరబాద్ నే మళ్ళీ రాజధానిగా కొనసాగించే ప్రతిపాదనను వైసీపీ సర్కార్ తెరపైకి తెస్తుందనేది రాజకీయ వాదులు చెబుతున్న మాట. అయితే రాజధాని విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యమైనది కాదని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి వినిపిస్తున మాట. మరి జగన్ సర్కార్ రాజధాని విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తోందనేది విశ్లేషణకు కూడా అంతు చిక్కని మిస్టరీగా ఉందనేది కొందరు కొందరి అభిప్రాయం.

Also Read:ప్రభాసే నా క్రష్ – పీవీ సింధు

- Advertisement -