ఏపీ మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ముహుత్తం ఖరారు..

309
Jagan Mohan Reddy
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం రేపు (శనివారం) ఏర్పాటు చేయనున్నారు. శనివారం ఉదయం 11.49గంటలకు సచివాయలయం ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్‌ ప్రమాణం చేయించనున్నారు. శనివారం ఉదయం 9:50 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 11:30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం ఉదయం 11:49 గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షతన తొలి కేబినెట్‌ సమావేశం జరగనుంది.

ఇక ఉదయం 8:39 గంటలకే సీఎం జగన్‌ తన ఛాంబర్‌లో అడుగుపెట్టనున్నారు. 8:42 గంటలకు తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేయనున్నారు జగన్‌. 8:50 గంటలకు కొన్ని ముఖ్యమైన దస్ర్తాలపై సంతకాలు చేస్తారు. ఆ తర్వాత 9:15 గంటలకు సచివాలయం గ్రౌండ్‌కు చేరుకుని మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొంటారు. ఇక మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి 5 వేల మంది అతిథులు హాజరు కానున్నారు. 1500 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ జరుగుతున్న పనులను వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘరాం, గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పరిశీలించారు. సభా వేదిక, బారికేడ్లు, పార్కింగ్, తదితర ఏర్పాట్లపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు. మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి సుమారు 5 వేల మంది వస్తారని గుంటూరు జాయింట్ కలెక్టర్ హీమాన్షు శుక్లా చెప్పారు.

రెండు మార్గాల్లో వేదిక వద్దకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశామని, వివిధ కేటగిరీల్లో మంజూరు చేసిన పాసులు కలవారు వారికి కేటాయించిన గ్యాలరీల్లో కూర్చోవాలని ఆయన సూచించారు. పాస్ లేకుండా సామాన్యులు కూడా ప్రమాణ స్వాకారానికి హాజరు కావచ్చనివారు వారికి కేటాయించిన గ్యాలరీల్లో కూర్చోవాలని చెప్పారు. 1500మంది పోలీసులను భద్రత కోసం ఏర్పాట్లు చేసిన్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు.

మంత్రి వర్గంలో పదవులు ఖాయం అయిన ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ చేసి శనివారం జరగబోయే ప్రమాణ స్వీకారానికి సిధ్దం కావాలని సమాచారం ఇచ్చారు. మొత్తం 25 మందితో జగన్ క్యాబినెట్ ఏర్పాటవుతోంది. వీరిలో అయిదుగురు డిప్యూటీ సీఎం లు ఉన్నారు.

- Advertisement -