గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్‌..

233
Chief Minister Y S Jagan
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం శనివారం కొలువుదీరనుంది. 25 మందితో పూర్తిస్థాయి కేబినెట్‌ ఏర్పాటు కానుంది. వీరందరి చేత గవర్నర్‌ నరసింహన్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ శంషాబాద్‌ విమానశ్రయం నుంచి గన్నవరం బయల్దేరిన గవర్నర్‌ నరసింహన్‌ విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ చేరుకున్న గవర్నర్‌ను సీఎం జగన్ కలుసుకున్నారు. స్థానిక గేట్ వే హోటల్ లో ఆయన్ని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్త మంత్రి వర్గం జాబితాను గవర్నర్ కు జగన్ అందజేశారు. ఈ జాబితాను గవర్నర్ ఆమోదించాక, కొత్త మంత్రులకు వాహనాలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ కానున్నాయి. కొత్త మంత్రులకు గన్ మెన్లను సిద్ధం చేసే ప్రయత్నంలో పోలీస్ శాఖ ఉన్నట్టు సమాచారం.

- Advertisement -