Jagan:పులివెందుల నా ప్రాణం

14
- Advertisement -

పులివెందుల వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు సీఎం జగన్. మినీ సెక్ర‌టేరియ‌ట్‌లోని ఆర్‌వో ఆఫీసుకు వెళ్లి అక్క‌డ పులివెందుల రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు.పులివెందుల నా ప్రాణం అంటూ ఎమోషనల్ అయ్యారు. క‌ష్ట‌కాలంలోనూ పులివెందుల త‌న‌కు అండ‌గా నిలిచింద‌ని, నియోజ‌క‌వ‌ర్గానికి మెడిక‌ల్ కాలేజీ క‌ల‌ను త్వ‌ర‌లోనే సాకారం చేస్తాన‌ని చెప్పారు.

ఇక చంద్రబాబుతో షర్మిల, సునీత చేతులు కలపడం బాధగా ఉందన్నారు జగన్. త‌న చిన్నాన్న వివేకాను చంపిన వాళ్లెవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని, అవినాష్ రెడ్డి జీవితాన్ని నాశ‌నం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. దివంగ‌త వైఎస్సార్‌పై కుట్ర‌లు చేసిన వారితో త‌న చెల్లెమ్మ‌లు చేతులు క‌ల‌ప‌డం దుర్మార్గ‌మ‌ని మండిపడ్డారు.

Also Read:వేసవిలో కూల్ కూల్ గా నిమ్మరసం?

- Advertisement -