ఒకే ఫ్రేమ్‌లో జగన్‌ -బాలయ్య..ఏం జరిగిందో తెలుసా?

91
Jagan
- Advertisement -

ఏపీలో టీడీపీ – వైసీపీ మధ్య జరుగుతున్న వివాదం గురించి మీకు తెలిసిందే. ఈ రెండు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. ఈ నేపథ్యంలో అగ్రనేతలు ఏపీ సీఎం జగన్‌, హిందుపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకరొకరు ఎదురుపడ్డారు.

సూపర్‌స్టార్ కృష్ణ పార్ధివదేహానికి నివాళులు అర్పించేందుకు వేర్వేరుగా వచ్చారు ఏపీ సీఎం జగన్, ఎమ్మెల్యే బాలకృష్ణ. తొలుత బాలకృష్ణ నివాళి అర్పించిన అనంతరం జగన్‌ రాగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

బాలకృష్ణ కాస్త వెనుక పక్క ఉండటంతో తొలుత జగన్ గమనించలేదు. ఆ తర్వాత బాలయ్య అక్కడ ఉన్న విషయం గ్రహించిన జగన్ నమస్కారం చేశారు. బాలయ్య కూడా అంతే మర్యాదతో జగన్‌కు ప్రతి నమస్కారం చేశారు. బాలయ్య వెనుక నుంచి ముందుకొచ్చి నిల్చున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -