నాణ్యమైన ధాన్యాన్నే కొనుగోలుకు తరలించాలి. అలాంటప్పుడే సరసమైన ధర వస్తుంది. ధాన్యం దిగుమతిని మిల్లర్లు వేగంవంతం చేయాలి. అందుకు అవసరమైన చర్యలను మొదలుపెట్టాలని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.. ఆదివారం ఆయన ధాన్యం కొనుగోల్లపై ఉన్నతధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగిలో సూర్యాపేటలో పెరిగిన వరి దిగుబడి.. ధాన్యం కొనుగొలులో సమస్యలు ఉత్పన్నం కాకూడదు. జిల్లాలో అదనంగా మరో 23రైస్ మిల్లులకు కొనుగోలు అనుమతులు ఇచ్చినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
2018-19 యాసంగిలో 2 లక్షల 23 ఎకరాల్లో సేద్యం జరిగింది. 2018-19 యాసంగిలో 2,12,433 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తే 2019-20 యాసంగిలో 3,96,166 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని అన్నారు. అయితే ఈ ఏడాది వర్షాకాలంలో 2,58,755 మెట్రిక్ టన్నుల వరి పండింది. సూర్యాపేట జిల్లాలో ఈ యాసంగిలోనూ 10 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంటను రైతులు పండించవచ్చు అని ఆయన తెలిపారు.