బీఆర్ఎస్ కాళేశ్వరం, కాంగ్రెస్ కుళేశ్వరం అంటే మరి బీజేపీ వాళ్ళు కొజ్జేశ్వరమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. బీజేపీ వాళ్ళు దేనికి ఉన్నారు.. మీ డ్రామాలు ఏంది అని ప్రశ్నించారు.
NDSAకి SLBC ఎందుకు కనబడడం లేదు ..ఆయన కుళేశ్వరం అంటే నువ్వు పీకేశ్వరం చేస్తున్నావా … NDSA చెప్పిన మాటలు అబద్ధం అన్నారు. పోలవరం ప్రాజెక్టులో కేవలం కొట్టుకుపోయిన దాని ఖర్చే రూ.2,700 కోట్లు…ఎలాంటి ఆటంకాలు రాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసింది కేసీఆర్ అన్నారు.
కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్ల బటన్లు నొక్కడానికి మీకు భయమైతే మేమే నొక్కుతాం…మేము ప్రాజెక్టు వీళ్ల చేతికి ఇచ్చినాటికి కూడా దాంట్లో నీళ్లు ఉన్నాయి.. వీళ్లు వచ్చి నీళ్ళు తీసేసారు… కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేస్తే, బ్యారేజీలకు ఏం జరిగినా మాదే బాధ్యత అని కేసీఆర్ గారితో అండర్ టేకింగ్ ఇప్పిస్తాం అన్నారు.
తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన వ్యక్తి కేసీఆర్ ..తన కళ్ల ముందు తాను కట్టిన ప్రాజెక్టును నాశనం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాడు..బ్యారేజీకి ఏమన్నా ప్రమాదం జరిగితే మేము శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటాము ..వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించి తెలంగాణ రైతులను రక్షించండి అన్నారు.
లేదు బ్యారేజీకి ఏమన్నా అయిద్ది అంటే దాని బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది …కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేస్తే సూపర్ ఎల్‌నినో నుండి రాష్ట్రాన్ని రక్షించవచ్చు…మా బీఆర్ఎస్ నాయకుల కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనపై నలుగురు మంత్రులు స్పందించారు కానీ ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డలం అన్న సోయితో మాట్లాడలేదు..అదే సొల్లు, బూతు పురాణం మాట్లాడారు అన్నారు.ప్రాణహిత నది గోదావరిలో కలిసే ప్రదేశంలోనే నీళ్లు అందుబాటులో ఉంటాయి, అక్కడే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు అని గుర్తు చేశారు జగదీష్ రెడ్డి.
Also Read:ఇండోనేషియాకు ప్రధాని మోదీ

