నిర్మాతగా మారిన ప్రదీప్ రంగనాథన్

0
- Advertisement -

రచయితగా, దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. “పీఆర్ షో” పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్‌లో తొలి సినిమాగా, డ్యూడ్ సినిమాలో ఆయనతో కలిసి నటించిన మమిత బైజు, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అశ్వత్ మారిముత్తు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శివాజీ సొంటినేని, స్వాసిక, అనామిక మహి, లిజ్జీ ఆంటోని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సాయి అభ్యంక్కర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను స్టైలిష్ అనౌన్స్‌మెంట్ వీడియోతో అధికారికంగా ప్రకటించారు. ఇందులో నటీనటులు, టెక్నికల్ టీమ్‌ను ఆసక్తికరంగా పరిచయం చేశారు. ఈ సినిమాకు కథను ప్రదీప్ రంగనాథన్ అందించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు.

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను ది ఆల్ఫా యూనిట్ పేరుతో పరిచయం చేసిన ఆరుగురు సభ్యుల బృందం నిర్వహిస్తోంది. ఇందులో విశాల్ టీఆర్, యష్ వి, నరేన్ సౌడా, చాణక్కియన్ ఆర్, ధనుష్ కుమార్, ఇళంపరితి ఉన్నారు. ఒకే సినిమాకు ఆరుగురు కలిసి దర్శకత్వం వహించడం ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

అనౌన్స్‌మెంట్ వీడియో మొత్తం యూత్‌ఫుల్ వైబ్‌తో సాగుతూ ఆసక్తిని పెంచుతుంది. చివర్లో ప్రదీప్ రంగనాథన్ స్టైలిష్ ఎంట్రీతో తన నిర్మాణ సంస్థను అధికారికంగా పరిచయం చేయడం ఆకట్టుకుంటుంది. సాయి అభ్యంకర్ ఇచ్చిన ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వీడియోకు మరింత జోష్ తీసుకొచ్చింది.

ఈ సినిమా కాస్టింగ్ కూడా మంచి ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలు తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు ఈ చిత్రంలో హీరోగా కనిపించనున్నారు. ఇదే సమయంలో ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ధర్మన్ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు.

టెక్నికల్ టీమ్ కూడా బలంగా ఉంది. సినిమాటోగ్రఫీని దినేష్ పురుషోత్తమన్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఈ రాఘవ్, ప్రొడక్షన్ డిజైన్‌ను అశ్విన్ లారా చూస్తున్నారు.విభిన్నమైన దర్శకుల బృందం, బలమైన నటీనటులు, టెక్నికల్ టీమ్, స్టైలిష్ అనౌన్స్‌మెంట్ వీడియోతో పీఆర్ షో తొలి నిర్మాణం ఇప్పటికే మంచి క్యూరియాసిటీని పెంచుతూ, అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.నటీనటులు: మమిత బైజు, అశ్వత్ మారిముత్తు, శివాజీ సొంటినేని, స్వసిక, అనామిక మహి, లిజ్జీ ఆంటోనీ

సాంకేతిక బృందం:
రచన & దర్శకత్వం: ది ఆల్ఫా యూనిట్ (విశాల్ టి.ఆర్, యష్ వి, నరేన్ సావోడా, చాణక్యన్ ఆర్, ధనుష్ కుమార్, ఇలంపరిధి)
బ్యానర్: PR Show
కథ & నిర్మాణం: ప్రదీప్ రంగనాథన్
సంగీతం: సాయి అభ్యంకర్
క్రియేటివ్ లీడ్: దీపన్ రాజ్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: రమేష్ నారాయణన్
డీవోపీ: దినేష్ పురుషోత్తమన్
ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ్
ప్రొడక్షన్ డిజైనర్: అశ్విన్ లారా
యాక్షన్: దినేష్ కాశి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హౌస్‌ఫుల్

- Advertisement -