పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి..

132
minister jagadish reddy
- Advertisement -

ఆదివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యపేట నియోజవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగాంగా సూర్యపేట మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో 2 కోట్ల 70 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వైకుంఠదామాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. అలాగే మున్సిపాలిటీ సిబ్బందికి చెత్త సేకరణ ఆటోలను పంపిణీ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లగడ్డను బంగారుగడ్డగా తీర్చి దిద్దుతామని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం అభివృద్ధిలో పురోగతి సాధించిందని ఆయన స్పష్టం చేశారు. తాళ్లగడ్డకు దక్షిణాన ఎస్పీ కార్యాలయం, ఉత్తరాన సద్దుల చేరువుపై నిర్మించిన మినీ ట్యాన్క్ బండ్‌ తూర్పున ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అన్నింటికీ మించి పడమటి భాగంలో మెడికల్ కాలేజీ నిర్మాణాలు ఈ ప్రాంత అభివృద్ధికి నిదర్శనమన్నారు. తాళ్లగడ్డ ప్రాంతం నలుదిక్కుల అభివృద్ధి చెందడమే కాకుండా ఇప్పుడు జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఈ ప్రాంతం దిక్సూచిగా నిలిచిందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్ కిషోర్, మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి, ఆయా సంబందిత వర్డ్ ల కౌన్సిలర్ లు, ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -