పోచారంను పరామర్శించిన జగదీష్ రెడ్డి..

233
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి తల్లి పరిగే పాపవ్వ(107) కన్నుమూశారు. బాన్సువాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ పాపవ్వ తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న పాపవ్వ మంగళవారం రాత్రి 11-12 గంటల మధ్య బాన్సువాడలో తుదిశ్వాస విడిచారు. బుధవారం పాపవ్వ అంత్యక్రియలు స్వగ్రామం పోచారంలో జరుగనున్నాయి. స్పీకర్ పోచారం తల్లి మృతి పట్ల టిఆర్ఎస్ ఎంఎల్ఎలు, నేతలు సంతాపం తెలిపారు.

Jagadish Reddyతల్లి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి మాతృవియోగం సమాచారం తెలుసుకున్న కేసీఆర్.. ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. అలాగే నేడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని స్వగ్రామంలో మాజీ మంత్రి,సూర్యపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కలసి పరామర్శించారు.

- Advertisement -