Jagadish Reddy:ఆస్తులు పెంచాం

22
- Advertisement -

తెలంగాణకు తెచ్చిన అప్పుతో ఆస్తులు పెంచామని ఎక్కడా నష్టం జరగలేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.శాసన సభలో విద్యుత్‌ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడిన జగదీష్‌ రెడ్డి… దేశంలో 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిపామన్నారు.

నీతి ఆయోగ్‌ తన స్టేట్‌ ఎనర్జీ అండ్‌ క్లైమెట్‌ ఇండెక్స్‌లో ప్రకటించిందని గుర్తు చేశారు. బిందెడు నీళ్లు లేకుండా ఇంటికి పోతే ఎసరు పెట్టే పరిస్థితి లేదని గుర్తు చేశారు. ఆనాడు పరిశ్రమలు, వాణిజ్య రంగం, వ్యాపార రంగం, జనరేటర్‌ లేని ఏ ఒక్క షాపు, ఇన్వర్టర్‌ లేని ఇల్లు ఉండేదా? అని ప్రశ్నించారు.

2014 జూన్‌ 2 నాటికి విద్యుత్‌ సంస్థల ఆస్తులు 44,438 కోట్లు ఉంటే.. అప్పు 22,423 కోట్లు ఉండేదని తెలిపారు. ఇప్పుడు ఆ అప్పులు 81,016 కోట్లు అవ్వగా.. ఆస్తుల విలువ 1,37,570 కోట్లకు పెంచామని వివరించారు. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదని.. ఆస్తులు పెంచామని వివరించారు. ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు ధర్నా చేసిన మొట్టమొదటి సందర్భం సమైక్య పాలనలోనే హైదరాబాద్‌లో జరిగిందని అన్నారు.

Also Read:కాలీఫ్లవర్‌ తో బరువుకు చెక్..!

- Advertisement -