టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు…

179
trs
- Advertisement -

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ పార్టీలో చేరుతున్నారని చెప్పారు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సంజీవయ్య కాలనీ,నల్లకుంటకు చెందిన 100 మందికిపైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు లక్ష్మారెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ శివకుమార్‌, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -