జేఏసీకి రాజకీయ పార్టీ అవసరమా..!

182
JAC Leaders fires on Kodandaram
- Advertisement -

జేఏసీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్త పరిచేందుకు అవకాశం లేదన్నారు జేఏసీ కో చైర్మన్ నల్లపు ప్రసాద్. ఈ మేరకు వారు ఆయనకు రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు. జేఏసీ కో చైర్మన్ నల్లపు ప్రహ్లాద్ అధ్యక్షతన 22 మంది జేఏసీ నేతలు హైదరాబాద్ లో సమావేశమై కోదండరాం తీరుపై చర్చించారు.

టీ జేఏసీ రాజకీయ పార్టీగా మారదని ఓ వైపు ప్రకటిస్తూనే.. మరో వైపు తెలంగాణకు ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరమని ఎందుకు ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నించారు. జేఏసీ రాజకీయ పార్టీలతో కలిసి పని చేయదని చెబుతూనే.. ఆయా పార్టీల నేతలను ఎందుకు కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారని అడిగారు. జేఏసీ సమావేశాలతో పాటు ఇతర సమావేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చి వెళ్లారే తప్ప… ఏనాడూ కూడా మిగతా జేఏసీ నేతల గురించి పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా కోదండరాం జేఏసీ నేతలతో కలిసి ముందుకెళ్లాలని చెప్పారు.

టీ జేఏసీ నియమ, నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ కోదండరాం వ్యవహరిస్తున్నారని జేఏసీ నేతలు తప్పుపట్టారు. . జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్, కో చైర్మన్ నల్లపు ప్రహ్లాద్, కో కన్వీనర్ తన్నీరు సుల్తానా కలిసి కోదండరాంకు రాసిన లేఖలోని విషయాలను ఈ సమావేశం సమర్థించింది. ఆ తర్వాత కోదండరాంకి వారు మరో బహిరంగ లేఖ రాశారు.

- Advertisement -