హైపర్ ఆది.. జబర్దస్త్ గురించి తెలిసిన వాళ్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అద్భుతమైన టైమింగ్‌తో పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తూ.. తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆది వేసే పంచ్‌లు చూసి నవ్వుకోవడానికే జబర్దస్త్ చూసే వాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి లేదు. ఆ ప్రోగ్రాంలో మిగతా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా.. ఆది దగ్గరకు వస్తే మాత్రం అదిరిపోవాల్సిందే. అలాంటి హైపర్ ఆది గుట్టుచప్పుడుకాకుండా ఓ ఇంటివాడయ్యాడు.
ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా, చాలా పరిమిత సంఖ్యలో ఆహ్వానించిన అతిథుల సమక్షంలో ఆది పెళ్లి చేసుకున్నట్లుగా.. కొన్నాళ్లుగా ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారంలో మునిగి ఉన్న ఈజంటకు ఇరు వర్గాలకు చెందిన పెద్దలు అంగీకరించక పోవడంతోనే.. ఆది రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు.. కనీసం జబర్దస్త్ కార్యక్రమ నిర్వాహకులు, తన టీమ్ లోని సహనటులకు కూడా తెలియకుండా.. పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజంలేదని తేలిపోయింది. హైపర్ ఆది పెళ్లికి సంబంధించిన ఫోటో ‘ఆటగదరా శివా’ అనే సినిమాకి సంబంధించిందని స్పష్టమైంది. అందరిలో ఆసక్తిని రేకెత్తించడం కోసమే సరదాగా ఈ పెళ్లి ఫోటోను వదిలామని ఆ చిత్ర దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ చెప్పాడు. దాంతో హడావిడిగా నడుస్తోన్న చర్చలకు హఠాత్తుగా ఫుల్ స్టాప్ పడిపోయింది. అయితే జబర్దస్త్ పుణ్యమా అని.. సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకున్నాడు ఆది. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు..