జబర్దస్త్ షో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. బూతులతో కొన్ని సార్లు పరిధి దాటినా.. ఎందర్నో నవ్వులతో ముంచెత్తింది ఈ షో. పైగా ఈ షో ద్వారా ఎందరో పైకి వచ్చారు. ముఖ్యంగా ఆల్ టైమ్ హాట్ యాంకర్ గా అనసూయకు గొప్ప క్రేజ్ వచ్చింది. కేవలం జబర్దస్త్ షో కారణంగానే అనసూయ ఈ రోజు ఈ స్థాయికి ఎదిగింది. అయితే, తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోను అనసూయ మానేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా తాను జబర్దస్త్ షో మానేయడం గురించి అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇంతకీ అనసూయ ఏం మాట్లాడింది అంటే.. తన పిల్లలతో గడపడానికి సమయం దొరకడం లేదనే ఉద్దేశంతోనే తాను జబర్దస్త్ షో మానేశానని ఆమె ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది. దీనికితోడు ఓ వైపు సినిమాల షూటింగ్స్.. మరోవైపు జబర్దస్త్. మధ్యలో ఈవెంట్స్.. అలాగే పర్సనల్ స్పేస్. మొత్తానికి తన పిల్లలతో తాను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నానని.. అందుకే గుడ్ బై చెప్పేశానని అనసూయ చెప్పింది. ఎనిమిదేళ్లుగా జబర్దస్త్ తనకు మంచి కెరీర్ ఇచ్చిందని.. జబర్దస్త్ చేయకపోవడం బాధగానే ఉందని అనసూయ చెప్పింది.
ఇక జబర్దస్త్ లో ప్రేమికుల్లా సందడి చేసిన జంట రాకింగ్ రాకేశ్, -జోర్దార్ సుజాత. త్వరలోనే వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. ఈ విషయాన్ని సుజాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలిపింది. తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. ఈనెల చివర్లో నిశ్చితార్థం జరగనుందని, త్వరలోనే పెళ్లి డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్లు చెప్పింది. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి…