జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ రష్మీ గౌతమ్ లైవ్ లో కన్నీరు పెట్టుకుంది. కరోనా వల్ల దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా రోజు వారి కూలీలు, పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది సమయానికి తిండి కూడా తినడం లేదు. తాజాగా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన యాంకర్ రష్మీ ఈ విషయాల గురించి చెబుతూ ఏడ్చేసింది. వీధుల్లో కుక్కలు, ఆవులు కూడా ఆహారం దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని తెలిపింది. మీకు తోచినంతంగా వాటికి ఆహారం అందించాలని కోరింది. దయచేసి పేదలకు అందరూ విరాళాలు ఇవ్వాలని కోరింది.
విరాళాలు అంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని కాదని తమకు తొచినంత ఇవ్వాలని అడిగింది. ఒక్క రూపాయి ఇచ్చిన అది చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పింది. మన ఇంటి పరిసరాల్లో ఉండే పేదలకు కూడా సాయం చేద్దామని పిలుపునిచ్చింది. సమాజంలో ఏర్పడిన ఇటువంటి పరిస్థితులను తాను ఎన్నడూ చూడలేదని తెలిపింది. కాగా కరోనా వైరస్ తో మన దేశంలో 20మంది మరణించగా…1000కి పైగా మందికి పాజిటివ్ వచ్చింది.