జబర్ధస్త్‌ రాకేష్ సుజాతల పెళ్లి ఫిక్స్‌

37
- Advertisement -

జబర్దస్త్‌ ఫేం రాకింగ్‌రాకేష్‌-జోర్దార్‌ సుజాత ఎట్టకేలకు ఒకటవ్వబోతున్నారు. అవును ఇది నిజం. ఎందరో కళాకారులను జబర్దస్త్‌ వేదిక లైఫ్ ఇచ్చింది. ఇలాంటి వేదికపై నుంచి కానీ తొలిసారి బుల్లితెర జంట నిజంగా పెళ్లి జంటగా మారనుంది. ఇదే వేదికగా సుధీర్ రష్మీ, ఇమ్మాన్యుయేల్‌ వర్ష వంటి జంటలు పెళ్లిళ్లు చేసుకోబోతున్నారని పుకార్లు చికార్లు చేసిన అవి నిజం కాలేదు. అయితే గత కొంత కాలంగా జబర్దస్త్‌ రాకేష్‌ జోర్దార్‌ సుజాత పెళ్లి చేసుకుంటారని వస్తున్న వార్తలపై నెటిజన్లకు క్లారిటీ ఇచ్చేశారు.

త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నామని శుభవార్త చెప్పారు. ఈ విషయాన్ని జోర్దార్‌ సుజాత తన యూట్యూబ్‌ ఛానెల్లో సూపర్ సుజాత ఛానెల్‌లో గుడ్‌న్యూస్‌ను చెప్పింది. సుజాత ఈ నెల చివర్లో నిశ్చితార్ధం ఉంటుందని త్వరలో తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 20న ప్రసారం కానున్న జబర్ధస్త్‌ షోకు ముందు విడుదలైన ప్రోమోలో రాకేష్‌ సుజాతకు రింగు తొడిగి అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ చేశాడు. ఇక అందరి చూపు ఈనెల 20న ప్రసారమయ్యే షోపై ఉంది.

ఇవి కూడా చదవండి…

తెలంగాణలో భారీ పెట్టుబడి…

ఓటీటీ : ఈ వారం కంటెంట్

మళ్లీ తల్లి కాబోతుందా?

- Advertisement -