మీడియాను నిలదీసిన ఇవాంకా ట్రంప్..

221
- Advertisement -

మహిళలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమ్మరం రేపుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన భారీ మూల్యం చెల్లించుకుంటున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌ తన కూతురిపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయన పరువు బజారున పడింది. జనంలో ట్రంప్‌ పరువు రోజు రోజుకి దిగజారుతూనే ఉంది. ‘నేను గనుక మరో ఇరవై ఏళ్ల తర్వాత పుట్టి ఉంటే.. నా కూతురితో డేటింగ్ చేసేవాన్ని’ అనే వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో పెద్ద దుమారం సృష్టిస్తున్నాయి.

అసలే వివాదస్పద వ్యాఖ్యలతో తన పొలిటికల్ మైలేజిని చేజేతులా నాశనం చేసుకున్న ట్రంప్.. ఈ ఒక్క వ్యాఖ్యతో ట్రంప్‌ తన పరువును కూడా పోగొట్టుకున్నారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీడియా-జనం ఏకమై దుమ్మెత్తి పోయగా.. ట్రంప్ కూతురు ఇవాంకా తన తండ్రి వ్యాఖ్యలపై స్పందించింది.

-ivanka-donald

‘ఒక తండ్రిగా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పే. ఈ వ్యాఖ్యలను ఖండించాల్సిందే. అయితే ఆ వీడియో బహిర్గతం అయిన వెంటనే అమెరికన్లందరికీ ట్రంప్‌ క్షమాపణలు చెప్పారు, మా నాన్న గురించి సమాజం కన్నా ఎక్కువగా నాకే బాగా తెలుసు అని తన తండ్రి ట్రంప్‌ను సమర్ధించారు ఇవాంకా.

తను మాట్లాడుతున్న సమయంలో.. మీడియా వైఖరిని కూడా తప్పుబట్టింది ట్రంప్‌ కుమార్తై ఇవాంకా. కూతురితో డేటింగ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన మీడియా.. ‘ఇవాంకా ట్రంప్ కు సెరోగేట్ వైఫ్(మారో భార్య) అంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం?’ అంటూ మీడియాను ప్రశ్నించింది. మీడియా వైఖరి తనను ఎంతగానో బాధించిదని ఇవాంకా తెలియజేసారు, బాధ్యత గల మీడియా ఇలాంటి ప్రచారం చేయడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇవాంకా.

trump

ట్రంప్ సెక్సువల్ కామెంట్స్ ను ఆయన భార్య మెలానియా ఖండించిన సంగతి తెలిసిందే. ఇదంతా ఇలా ఉంటే.. జరుగుతున్న పరిణామాల చూస్తోంటే ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఆయన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే అనిపిస్తోంది. మహిళలను చులకన, అవహేలన చేస్తూ ఆయన చేసిన లైంగిక వ్యాఖ్యలు నవంబర్ 8న జరగబోయే పోలింగ్ లో స్పష్టమైన ప్రభావం చూపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -