డార్లింగ్‌ లుక్‌పై స్పందించిన సాయిధరమ్ తేజ్..

238
Sai Dharam
- Advertisement -

ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకర్ దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరెకెక్కిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యూ’. ఇందులో కథానాయికగా నటిస్తోంది అనుపమా పరమేశ్వరన్. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 Sai Dharam

ఇక తాజాగా విడుదల చేసిన చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ బోలడన్ని ఆశలు పెట్టుకున్నాడు. వరుసగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న ఈ హీరో ఈ మూవీతోనైనా మంచి హిట్ కొట్టాలనుకుంటున్నాడు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఓ స్టిల్ విడుదల చేశారు చిత్ర యూనిట్.

ఆ పోస్టర్‌లో డార్లింగ్ సినిమాలో ప్రభాస్‌లాగే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్స్‌పై స్సందించారు సాయిధరమ్ తేజ్. కేవలం గిటార్ తగిలించుకొని మైక్‌ పట్టుకున్నంత మాత్రానా డార్లింగ్‌ కాదు.. ఇది తేజ్‌ ఐ లవ్‌ యు’అంటూ కామెంట్‌ చేశాడు. ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభించిన సినిమా యూనిట్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -