జులైలో రానున్న‌ కళ్యాణ్ దేవ్ ‘విజేత’ !

242
vijetha
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రానికి విజేత అనే టైటిల్‌ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై లో విడుదల చెయ్యడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.ఇటీవల విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అభిమానుల అంచనాలకు తగట్లు ఈ సినిమా ఉండబోతోందన్నారు చిత్ర‌యూనిట్ .

Kalyaan-Dhev

రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ‘బాహుబలి’ కెమెరామెన్ కె.కె.సెంధిల్ సినిమాటోగ్రఫర్ గా ప‌నిచేశాడు. కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో నటుడు మురళి శర్మ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Kalyaan-Dhev

త‌నికెళ్ల భ‌ర‌ణి , నాజ‌ర్ , పోసాని కృష్ణ‌ముర‌ళి, రాజీవ్ క‌న‌కాల ప‌లువురు కీల‌క‌పాత్ర‌లో పోషించారు. ఈసినిమాకు హ‌ర్ష వ‌ర్ద‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందించారు. మెగా ఫ్యామిలీ నుండి మ‌రో హీరో వ‌స్తుండ‌టంతో ఈసినిమాపై మెగా అభిమానులు భారీ అంచానాలు పెట్టుకున్నారు.

- Advertisement -