మహాకూటమి..మాయా కూటమి-చెత్త కూటమి:కేటీఆర్

337
ktr trsv
- Advertisement -

రైతు బంధు పథకంతో రైతుల బాంధవుడిగా సీఎం కేసీఆర్ మారారని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌వీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడుపుతున్న ఘనత కేసీఆర్‌దే అన్నారు.

తెలంగాణ కోటి ఎకరాల మాగాణీ కావడమే కేసీఆర్ లక్ష్యం ప్రస్తుత రాజకీయాలపై విద్యార్థులకు అవగాహన ఉంది. తెలంగాణ దేశంలోనే అధిక వృద్ధిరేటు గల రాష్ట్రమన్నారు. కాంగ్రెస్ నేతలు దద్దమ్మల్లా ఇంట్లో పడుకుని ఉంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. విపక్షాలది మహాకూటమి కాదని మాయా కూటమి-చెత్త కూటమి-జప్ఫా కూటమి అని ఎద్దేవా చేశారు.

ప్రస్తుత ఎన్నికలు రాహుల్ గాంధీ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ బిచ్చమేసిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారని చెప్పారు. 2004లో తెలంగాణ ఇస్తామంటే కాంగ్రెస్‌తో పోత్తు పెట్టుకున్నామని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కత్తి గట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు.

ఇప్పటికే 87వేలకు పైగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. సీల్‌ కవర్ సీఎం కావాలా తెలంగాణ మట్టిలో పుట్టిన కేసీఆర్ సీఎం కావాలో తేల్చుకోవాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు.వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాలో అది కూడా విద్యార్థులకే ఎక్కువ అవగాహన ఉందన్నారు కేటీఆర్. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలిచిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇవ్వబోతున్నాం. తెలంగాణ మంచి ఆర్థిక ప్రగతిని సాధించింది అని కేటీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -