రాజకీయ సంక్షోభం..ఇటలీ ప్రధాని రాజీనామా

60
italy
- Advertisement -

ఇటలీలో రాజకీయ సంక్షోభం తారాస్ధాయికి చేరడంతో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు మారియో డ్రాఘి. తదుపరి ఎన్నికల వరకు అపద్ధర్మ ప్రధానిగా డ్రాఘి కొనసాగనున్నారు. ఇటలీలో మారియో డ్రాఘి నేతృత్వంలోని జాతీయ ఐక్య ప్రభుత్వంలో.. ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్, ఫోర్జా ఇటాలియా, యాంటీ ఇమ్మిగ్రాంట్‌ లీగ్‌, డెమోక్రటిక్‌ పార్టీ, ఆర్టికల్‌ వన్ తదితర పార్టీల భాగస్వామ్యం ఉంది.

అయితే.. ఇంధన, ఆర్థిక సంక్షోభంపై ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ, యుక్రెయిన్‌కు తోడ్పాటు విషయంలో ఇటీవల భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకున్నారు ఇటలీ మాజీ ప్రధాన మంత్రి గియుసెప్. సెనెట్‌లో బుధవారం విశ్వాస పరీక్ష నిర్వహించగా మెజారిటీ లేకపోడంతో ప్రధాని డ్రాఘి రెండోసారి రాజీనామా చేశారు.

- Advertisement -