ఇటలీలో పెళ్లి..9 మంది అతిథులే!

5
- Advertisement -

పెళ్లి అంటే వందలాది మంది బంధుమిత్రులు, ధూమ్ ధామ్ హడావుడి, భారీ ఖర్చు.. ఇదీ సాధారణంగా మనకు కనిపించే భారతీయ వివాహ వేడుక. కానీ, ఈ భారతీయ వధువు మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించింది. తన జీవితంలోనే అత్యంత ప్రత్యేకమైన రోజును ఎలాంటి హడావుడి లేకుండా, కేవలం అత్యంత ఆప్తులైన 9 మంది అతిథుల సమక్షంలోనే ఎంతో అందంగా ప్రశాంతంగా జరుపుకుంది.

ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీల డ్రీమ్ వెడ్డింగ్ డెస్టినేషన్ అయిన ఇటలీలోని ‘లేక్ కోమో’ తీరంలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఆ ఫోటోలు ఎంత అందంగా ఉన్నాయంటే చూసే ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో అతి తక్కువ మందితో చేసుకునే ‘ఇంటిమేట్ వెడ్డింగ్స్’ సంస్కృతి బాగా పెరుగుతోంది. ఈ వధువు కూడా అదే బాటలో పయనించింది. వందల మందిని పిలిచి హడావుడి పడటం కంటే.. ప్రకృతి ఒడిలో, అత్యంత రమణీయమైన లేక్ కోమో సరస్సు బ్యాక్‌డ్రాప్‌లో, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలని ఆమె నిర్ణయించుకుంది.

Also Read:పొగాకు లంగ్స్‌కే కాదు..!

తమకు నచ్చినట్లుగా ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధతో ప్లాన్ చేసుకున్నామని, ఈ పెళ్లి వేడుక తమ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని వధువు పేర్కొంది. లేక్ కోమోలోని చారిత్రాత్మక విల్లా బ్యాక్‌డ్రాప్, సాంప్రదాయ మరియు ఆధునిక శైలి కలబోసిన వధూవరుల దుస్తులు, సరస్సు అందాల మధ్య తీసిన వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. నిజమైన పెళ్లి అంటే ఇలాగే ఉండాలి ఎలాంటి హడావుడి లేకుండా ఎంత ప్రశాంతంగా ఎంత రాయల్‌గా ఉందో అంటూ నెటిజన్లు ఈ జంటపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

- Advertisement -