టెన్నీస్‌ ఇలా కూడా ఆడుతారా..!

537
tennis
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రజలను కభళిస్తోంది. చైనా నుండి వ్యాపించిన ఈ వైరస్‌ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్‌తో చైనాలో అత్యధిక మరణాలు నమోదు కాగా తర్వాత ఇటలీలో అధిక మరణాలు నమోదు అయ్యాయి. ఇటలీలో ఇప్పటికే 2,503 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇటలీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది.

ఇదిలావుంటే మరోవైపు పలువురు ఈ వైరస్‌పై సోషల్‌ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ జనాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు తమ ఇంట్లోని కిటికీల నుంచి టెన్నిస్‌ ఆడి అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. ఈ యువకుల టెన్నీస్‌ ఆటను మిగతా అపార్ట్‌మెంట్‌ వాసులు ఆసక్తిగా తిలకించి తమ మొబైల్స్‌లో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆలస్యం ఎందుకు మీరూ ఈ వీడియోను తిలకించండి..!

https://twitter.com/pamsareesuth/status/1239581219894984705

- Advertisement -